Share News

వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:50 PM

వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

వినాయక మండపాలకు  అనుమతి తప్పనిసరి: ఎస్పీ
ఎస్పీ సునీల్‌ షొరాన్‌

నంద్యాల క్రైం, సెప్టెంబరు 7, (ఆంధ్రజ్యోతి) : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్టించే వారు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలని ఎస్పీ సునీల్‌ షొరాన్‌ సూచించారు. ఉత్సవ కమిటీలు ఉచిత సింగిల్‌ విండో విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు స్థల యజమాని, పంచాయతీ, మున్సిపాలిటీ అనుమతులు, ఫైర్‌, విద్యుత్‌ శాఖల నిబంధనలు పాటించాలని సూచించారు. రహదారులకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగేలా మండపాలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదన్నారు. లౌడ్‌ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, డీజేలు, మందుగుండు సామగ్రి వినియోగించరాదని స్పష్టం చేశారు. నిమజ్జన సమయంలో మద్యం, మత్తు పదార్ధాలు సేవిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 11:50 PM