Share News

నిబద్ధతతో విధులు నిర్వహించండి

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:30 PM

హోంగార్డులు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సదరన్‌ రీజియన్‌ హోంగార్డ్స్‌ కమాండెంట్‌ హనుమంతు పేర్కొన్నారు.

నిబద్ధతతో విధులు నిర్వహించండి
చెక్కులు అందజేస్తున్న ఏ. హనుమంతు

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం సదరన్‌ రీజియన్‌

హోంగార్డ్స్‌ కమాండెంట్‌ హనుమంతు

కర్నూలు క్రైం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): హోంగార్డులు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సదరన్‌ రీజియన్‌ హోంగార్డ్స్‌ కమాండెంట్‌ హనుమంతు పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో హోంగార్డ్స్‌ దర్బార్‌ను ఆయన నిర్వహించారు. హోంగార్డుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ఆయన మా ట్లాడుతూ ప్రతి హోంగార్డు తమఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సూచించారు. హోంగార్డ్స్‌, కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి సురక్ష బీమా(పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాల ప్రాముఖ్యతను వివరించారు. పదవీ విరమణ పొందిన హోంగార్డ్స్‌ కేసీ పాం డురంగ, జ్ఞానరత్నమ్మ, సి.కమ్మన్నను శాలువలు, పూలమాలలతో సత్కరించారు. హోంగార్డ్స్‌ కాంట్రిబ్యూషన్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. వీరికి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందేలా చర్యలు తీసుకోవాలని హోంగార్డ్స్‌ కమాండెంట్‌ను ఆదేశించారు. హోంగార్డ్స్‌ డీఎస్పీ ప్రసాద్‌, ఇన్‌చార్జి ఆర్‌ఐ పోతులరాజు, సబ్‌ డివిజన్‌ ఇన్‌చార్జిలు కార్యాల య సిబ్బంది, ఇతర అధికారులు, హోంగార్డులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 11:30 PM