Share News

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించండి

ABN , Publish Date - Oct 25 , 2026 | 11:48 PM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిబంధనలను పాటిస్తూ పోలింగ్‌ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

పోలింగ్‌ అధికారుల పాత్ర కీలకం

కలెక్టర్‌ రాజకుమారి

నందికొట్కూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిబంధనలను పాటిస్తూ పోలింగ్‌ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారుల పాత్ర అత్యంత కీలకమన్నారు. శిక్షణలో వివరించిన ఎన్నికల విధి విధానాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని, తమకు కేటా యించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని సూచించారు.

పకడ్బందీగా పూర్తి చేయాలి

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్‌ రూంలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్‌ కేంద్రాలు, కౌంటింగ్‌ హాళ్లలో అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూం, రిసెస్ఫన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ హాల్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పా ట్లను సమీక్షించి, కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, సిబ్బంది విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూంల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల్లో సమన్వ యంతో పనిచేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 11:48 PM