Share News

ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి

ABN , Publish Date - May 13 , 2026 | 12:17 AM

ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి
కరపత్రం పంపిణీ చేస్తున్న మంత్రి టీజీ భరత

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు అర్బన్‌, మే 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. మంగళవారం నగరంలోని 8వ వార్డులో మన నగరం... మన బాఽధ్యత కార్యక్రమం పేరుతో మంత్రి ఇంటింటి పర్యటన చేపట్టారు. వార్డులో తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజలను కలిసి మాట్లాడుతుంటే రెండేళ్ల పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారన్నారు. చంద్ర బాబు విజనతో ఊహించిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నా మన్నారు. అన్ని వార్డుల్లో ప్రాధాన్యత క్రమంలో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. చిన్న చిన ్న సమస్యలు పరిష్కరించడంలో సచివాలయ ఉద్యోగులు విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొరకంచి రవి, స్థానిక కార్పొరేటర్‌ కురువ పరమేష్‌, సీనియర్‌ నాయకులు, బూత ఇనచార్జిలు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:17 AM