Share News

ప్రజా నాయకుడు వెంకట కృష్ణారావు

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:30 PM

సామాజిక సేవా దృక్పథంతో ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేసిన ప్రజా నాయకుడు మండలి వెంకటకృష్ణారావు అని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్‌ అన్నారు.

ప్రజా నాయకుడు వెంకట కృష్ణారావు
వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న డీఆర్వో

డీఆర్వో రామునాయక్‌

నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : సామాజిక సేవా దృక్పథంతో ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేసిన ప్రజా నాయకుడు మండలి వెంకటకృష్ణారావు అని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో మండలి వెంకటకృష్ణారావు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. కృష్ణారావు కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచారని అన్నారు. 1974లో ఆయన విద్యా-సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి సునీల్‌ కన్నా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:30 PM