ప్రజల నమ్మకమే టీడీపీ గెలుపునకు పునాది
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:46 PM
ప్రజాప్రతినిధులు ప్రజల్లో సంపాదించే నమ్మకమే ఎన్నికల్లో గెలుపుకు పునాది అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
శిరివెళ్ల, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులు ప్రజల్లో సంపాదించే నమ్మకమే ఎన్నికల్లో గెలుపుకు పునాది అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శనివారం కామినేనిపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మేరువ చిన్న నరసింహారెడ్డి తన అరుచరులతో కలిసి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పార్టీలకతీతంగా పంచాయతీలకు నిధులు, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత వైసీపీ అరాచకాలను.. నేడు కూటమి ఆదర్శ పాలనను చూసిన నాయకులు స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారన్నారు. కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్రెడ్డి, మాజీ సర్పంచ్ శిరిగిరి రాంభూపాల్రెడ్డి, శకుంతలమ్మ, యామా గుర్రప్ప, సూరా రామ, మురళి, శివరామిరెడ్డి, కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, రవిచంద్రారెడ్డి ఉన్నారు.