వైసీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:16 AM
వైసీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుంచి తెలుగుపేటలో ఇంటింటికి ప్రచారం చేశారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుంచి తెలుగుపేటలో ఇంటింటికి ప్రచారం చేశారు. మంత్రి బీసీకి తెలుగుపేటలో ఘన స్వాగతం పలికారు. మంత్రి బీసీ బంగారమ్మ గుడిలో పూజలు చేశారు. మంత్రి బీసీ ఇంటింట ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రెండేళ్ల పాలనలోని సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుపేటలో వీధిలైట్లు, డ్రైనేజీ, కుళాయిలు కావాలని ప్రజలు కోరగా మంత్రి స్పందించి ఆ సమస్యలు పరిష్కరించాలని అఽధికా రులను ఆదేశించారు. వైసీపీ నిత్యం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల ను తప్పుదోవ పట్టించడానికి యత్నిస్తున్నారని, అయితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అయినా వారిలో మార్పు రాలేదన్నారు. తెలుగుపేట టీడీపీ నాయకులు దత్తసురేశ్‌బాబు, వెంకట సుబ్బయ్య, రంగడు, జక్కుజబ్బార్, బైరెడ్డిగో పాల్, లావు నరసింహ, జక్కు కృష్ణన్న, శ్రీను, రామాంజనేయులు, బురా నుద్దీన్, కాశీంబాషా, అత్తార్ అబ్దుల్ కలాం, డీఈ నాగశ్రీనివాసులు, ఏఈ శ్రీనిసులు, ఏఈ సాయికృష్ణ పాల్గొన్నారు.