అభివృద్ధి చేసిందెవరో ప్రజలే నిర్ణయించాలి
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:07 AM
అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలే నిర్ణయించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం టిట్కో గృహాల్లో రూ.2.31 కోట్లతో నిర్మించిన 11 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్, ప్రభు త్వ ఆసుపత్రిలో ఓపీ బ్లాక్, పడకండ్ల గ్రామం లో రూ.75 లక్షలతో నిర్మించిన మురుగు కాలువను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆళ్లగడ్డ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలే నిర్ణయించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం టిట్కో గృహాల్లో రూ.2.31 కోట్లతో నిర్మించిన 11 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్, ప్రభు త్వ ఆసుపత్రిలో ఓపీ బ్లాక్, పడకండ్ల గ్రామం లో రూ.75 లక్షలతో నిర్మించిన మురుగు కాలువను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఐదేళ్ల పాలనలో ఆళ్లగడ్డ ప్రజలకు ఏమీ చేయని వైసీపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు విమర్శించారు. బత్తలూరు గ్రామంలో మురుగు ఇళ్లవద్ద ఉండేదని, మంత్రి నారాయణతో మాట్లాడి డ్రైనేజీ నిర్మించామన్నారు మొలకల వాగుకు గతంలో డ్రెయిన్ నిర్మించామని, రామలక్ష్మి కోట్టాల, నాలుగు రోడ్ల సర్కిల్, పడకండ్ల కాలనీల్లో ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. మున్సిపాలిటీకి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ.21 కోట్లతో పాటు, మరో రూ.10 కోట్లతో అభివృద్ది పనులు చేశామని ఎమ్మెల్యే వివరించారు. టీడీపీ పరిశీలకుడు దేవల్ల మురళి, మాజీ కౌన్సిలర్ హుసెన్‌బాషా, సుధాకర్‌రెడ్డి, నాగేంద్ర, విష్ణువర్దన్‌రెడ్డి ఉన్నారు.
శిరివెళ్ల టీడీపీకి కంచుకోట
శిరివెళ్ల: తెలుగుదేశం పార్టీకి శిరివెళ్ల కంచుకోట అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. గ్రామానికి చెందిన మౌలా కరీం, బిలాల్, అబూబకర్, మౌలా ఇమ్రాన్, షేర్, ఫరీద్‌బాబు, వహీద్బాబు, హఫీజ్, బురా అస్లాం, బురా బిలాల్ తదితర 40 కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు. కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివరామిరెడ్డి, మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, సూరా రామ, బీసీ ఖాజాహుసేన్, ఫిదాహుసేన్, యామా శ్రీనివాసులు, శ్రీకాంత్, ఉల్లి సుబ్బయ్య, జిక్రియా, సూరా శ్రీనివాసులు, సిద్ధిఖ్, కరీం పాల్గొన్నారు.