అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:40 AM
రాష్ట్రంలో నిర్వహించిన పురపాలిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్వహించిన పురపాలిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. అరాచకాలతో గెలవాలనుకున్న గొడ్డలి పార్టీకి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పారన్నారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూటమికి ప్రజలు జై కొట్టారని, ఈ ఎన్నికల ఫలితాలతోనైనా జగన్ తన తీరు మార్చుకోవాలని సూచించారు. అరాచకాలు వద్దు.. అభివృద్ధి కావాలంటూ రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, వారి తీర్పును గౌరవించి నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని అన్నారు. పరిషత్ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.