Share News

వేరుశనగ ధర పతనం

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:43 PM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్ట్‌లో వేరుశనగ ధరలు రోజురోజుకూ మరింత పతనమవు తున్నాయి.

వేరుశనగ ధర పతనం
విక్రయానికి వచ్చిన వేరుశనగ దిగుబడులు

క్వింటా రూ.8,800

ఆదోని అగ్రికల్చర్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్ట్‌లో వేరుశనగ ధరలు రోజురోజుకూ మరింత పతనమవు తున్నాయి. నాలుగు రోజుల్లో గరిష్ఠంగా క్వింటానికి రూ.800ధర పతనమైంది. సోమవారం మార్కెట్‌ యార్డ్‌లో వేరుశనగ ధర రూ.8,800కు పడిపోయింది. పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు పతనంపై రైతులు ఆందోళన చేస్తున్నారు. వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తు న్నారు. 12,157 వేరుశనగ బస్తాలు రైతులు విక్రయానికి తీసుకురాగా క్వింటం కనిష్ఠ ధర రూ.3499, మధ్యస్థం రూ.7,889, గరిష్ఠ ధర రూ.8,800 పలికింది.

Updated Date - Mar 09 , 2026 | 11:43 PM