Share News

వేరుశనగ ధర పతనం

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:13 PM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వేరుశనగ ధరలు పతనమయ్యాయి.

వేరుశనగ ధర పతనం
విక్రయానికి వచ్చిన వేరుశనగ దిగుబడులు

క్వింటం గరిష్ఠంగా రూ. 9,755

ఆదోని అగ్రికల్చర్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వేరుశనగ ధరలు పతనమయ్యాయి. గతవారంతో పోల్చితే వేరుశనగ ధర క్వింటానికి రూ.400 తగ్గిపోయింది. బుధవారం క్వింటం గరిష్ఠంగా రూ.9,755 పలికింది. ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోరు బావులు కింది సాగైన వేరుశనగ చేతికందే సమయంలో ధరలు పతనంపై రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. 10,162 బస్తాలు విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.3,199, మధ్యంతర ధర రూ. 8,969, గరిష్ఠ ధర రూ. 9,755 పలికింది.

Updated Date - Mar 04 , 2026 | 11:13 PM