Share News

ఇద్దరిపై పీడీ యాక్ట్‌

ABN , Publish Date - May 03 , 2026 | 11:02 PM

మద్దికెర గ్రామానికి చెందిన సాతుపాటి కృష్ణ, కల్లూరు మండలం కొల్లంపల్లి తాండకు చెందిన తెలుగు రామదాసులపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశామని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌ బాబు తెలిపారు.

ఇద్దరిపై పీడీ యాక్ట్‌
యాక్ట్‌ కేసుల్లో నిందితులు

సారా, కల్తీ మద్యం కేసుల్లో చర్యలు తప్పవు

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌ బాబు

కర్నూలు అర్బన్‌, మే 3(ఆంధ్రజ్యోతి): మద్దికెర గ్రామానికి చెందిన సాతుపాటి కృష్ణ, కల్లూరు మండలం కొల్లంపల్లి తాండకు చెందిన తెలుగు రామదాసులపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశామని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌ బాబు తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ డా. ఏ. సిరి ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కల్తీమద్యం వ్యాపారం, మాదకద్రవ్య నేరాలు, అనైతిక రవాణా నేరాల కింద కేసులు నమోదు కావడంతో వారిని ఎక్సైజ్‌ ఏఈఎస్‌ రామకృష్ణారెడ్డి, సీఐలు సువర్ణలత, చంద్రహస్‌, రాజేంద్ర ప్రసాద్‌ అరెస్టు చేసి కడప జైలుకు తరలించారని తెలిపారు. నాటు సారా, కల్తీ మద్యం నేరాల్లో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నేరస్తులు ఈ నేరాలు మానివేస్తే ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడానికి మెప్మా బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంక్షేమ విభాగాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 11:02 PM