Share News

ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:40 AM

: పోలీసులు ఆరో గ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు.

ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
మాట్లాడుతున్న ఎస్పీ విక్రాంత పాటిల్‌

ఎస్పీ విక్రాంత పాటిల్‌

కర్నూలు క్రైం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పోలీసులు ఆరో గ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు. ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా రాషీ్ట్రయ ఏక్తా దివస్‌ను బుధవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయం ఆవరణలోని మినీ కాన్ఫరెన్స హాలులో నిర్వహించారు. జెమ్‌కేర్‌ కామినేని హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం చేపట్టారు. ఈశిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. నిరంతరం శ్రమించే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 254 మంది పోలీసు అధికా రులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. జెమ్‌కేర్‌ హాస్పిటల్స్‌ సీఈవో, వైద్యబృందానికి ఎస్పీ శాలువ కప్పి జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో అడిషినల్‌ ఎస్పీలు హుస్సేనపీరా, కృష్ణమో హన, జెమ్‌కేర్‌ కామినేని హాస్పిటల్స్‌ సీఈవో చంద్రశేఖర్‌, ఆర్థోపెడిక్‌ డా.రవిబాబు, జనరల్‌ మేనేజర్‌ నదీమ్‌, పోలీస్‌ వెల్ఫేర్‌ డా.స్రవంతి, డీపీవో ఏవో జగన్నాథరావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగ రాజు, సీఐలు, ఆర్‌ఐలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 12:40 AM