గ్రామాల సమగ్రాభివృద్ధికి బాటలు
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:26 PM
: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ-రామ్‌జీ) ద్వారా ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడంతో పాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాటలు వేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.
ఎంపీ బస్తిపాటి నాగరాజు
జిల్లాలో యాక్టివ్ జాబ్‌కార్డులు 2.59లక్షలు
కలెక్టర్ ఏ.సిరి
వెల్దుర్తిలో ‘ వీబీజీ-రామ్‌జీ’ ప్రారంభం
వెల్దుర్తి, జూలై 2(ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ-రామ్‌జీ) ద్వారా ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడంతో పాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాటలు వేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. గురువారం మండల కేంద్రమైన వెల్దుర్తిలో ‘వీబీజీ-రామ్‌జీ’ని కలెక్టర్ ఏ.సిరి, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ వీబీజీ-రామ్‌జీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఉపాధి హామీ పథకం లో గుర్తించిన లోపాలను సరిదిద్దుతూ మరింత పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కేంద్రం సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వీబీజీ-రామ్‌జీ పేరుతో అమలు చేస్తోందన్నారు. జిల్లాలో 3.15 లక్షల జాబ్‌కార్డులు నమోదు కాగా, 2.59లక్షల జాబ్‌కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయని మిగతా వారు యాక్టివ్ చేయించుకుని ఉపాధి పొందాలన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని, 125 రోజులు పని దొరికే వీబీజీ-రామ్‌జీ పథకాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఈ పథకం ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ సిరి కేక్ కట్‌చేసి శ్రామికులకు పంచారు. తర్వాత అక్కడే ఏర్పాటుచేసిన స్టాల్‌ను సందర్శించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ నరసింహరెడ్డి, ఆర్డీవోలు ఓబులేసు, సందీ్‌పకుమార్, జడ్పీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి, జిల్లా నాయకుడు సుబ్బారాయుడు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌గౌడు, సింగిల్‌విం డో చైర్మన్ రమాకాంత్‌రెడ్డి, తెలుగుయువత అధ్యక్షుడు సుధాకర్‌గౌడు, మాజీ సర్పంచులు రామకృష్ణఆచారి, అమర్‌నాథ్‌గౌడు, తహసీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో రవికిశోర్, అధికారులు, నాయకులు, శ్రామికులు, ప్రజలు పాల్గొన్నారు.