Share News

పత్రీజీ సేవాదళ్‌ ధ్యాన మహాయజ్ఞం ప్రారంభం

ABN , Publish Date - May 01 , 2026 | 12:12 AM

నగర శివారు జగన్నాథగట్టుపై ఉన్న పిరమిడ్‌ సేవాదళ్‌ జేషనల్‌ లైనింగ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో గురువారం రాత్రి పత్రీజీ సేవాదళ్‌ ధ్యాన మహా యజ్ఞం, బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా ఆరం భమయ్యాయి.

పత్రీజీ సేవాదళ్‌ ధ్యాన మహాయజ్ఞం ప్రారంభం
వేడుకలను ప్రారంభిస్తున్న టీజీ వెంకటేశ, గౌరు చరిత

కర్నూలు కల్చరల్‌/ కల్లూరు, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): నగర శివారు జగన్నాథగట్టుపై ఉన్న పిరమిడ్‌ సేవాదళ్‌ జేషనల్‌ లైనింగ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో గురువారం రాత్రి పత్రీజీ సేవాదళ్‌ ధ్యాన మహా యజ్ఞం, బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా ఆరం భమయ్యాయి. మూడు రోజుల పాటూ మే 2వరకు కొనసాగే ఈ వేడుకలను రా జ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు ధ్యాన సెంటర్‌ వ్యవస్థాపకుడు బీవీ రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. టీజీ వెంకటేశ మాట్లాడుతూ పత్రీజీ ఉన్నత ఆశయాలతో నెలకొల్పిన ధ్యాన కేంద్రాలను నెలకొ ల్పారని ధ్యాన సేవయే దైవ సేవగా ఆయన ఉద్బోధించారని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్‌బాషా, ధ్యాన మహాయజ్ఞం నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 12:12 AM