Share News

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:47 PM

: రాయలసీమ జిల్లాల ఆరోగ్య సంజీవని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసిసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ అధికారులను ఆదేశించారు.

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాల ఆరోగ్య సంజీవని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసిసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో సర్వజన వైద్యశాల హాస్పిటల్‌ డెవలప్మెంట్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ ఎ.సిరి అధ్యక్షతన నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో నెక్స్‌జెన్‌ హాస్పిటల్‌ సాప్ట్‌వే ర్‌ను వినియోగించుకుని ఆసుపత్రిలో అన్ని సేవలు పేపర్‌ లెస్‌గా అందించే విదంగా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఆసుపత్రిలో పందులను నియంత్రించాలని, మ్యాన్‌హోల్స్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న చెత్తను తీసి పందులను మేపుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయనీ, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అంశంపై అధికంగా చెల్లిస్తున్నామని, ఈ ధరలను తగ్గించి ప్రభుత్వ ధనాన్ని పొదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. హెచ్‌డీఎస్‌ సభ్యులు ఆసుపత్రిలో స్ర్కాఫ్‌ చాలా ఉందని, క్లియర్‌ చేయాలని, తాగునీటి సమస్య, పారిశుధ్య, సెక్యూరిటీ కార్మికులకు ఎంవోయూ ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. డ్రగ్స్‌ పర్చేజ్‌ టెండర్లపై విచారణ జరిపించాలని కోరారు. సమావేశంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌ డా.కె.చిట్టినరసమ్మ, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ చిరంజీవులు, హెచ్‌డీఎస్‌ సభ్యులు డా.ప్రవీణ్‌, పీటీ సాయిప్రదీప్‌, బి.రామాంజనేయులు, రఘునాథరెడ్డి, జగదీశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 11:47 PM