పరిశ్రమలతో ప్రగతికి బాటలు
ABN , Publish Date - May 28 , 2026 | 12:22 AM
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో ప్రగతికి బాటలు వేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కన్నుల పండువగా డిజిటల్ మహానాడు
కల్లూరు, మే 27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో ప్రగతికి బాటలు వేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు, అర్బన వార్డులలో నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎనటీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి, కార్యకర్తల సమక్షంలో కేక్‌కట్ చేశారు. కల్లూరు క్లస్టర్-1, ఉలిందకొండ క్లస్టర్-2, పెద్దపాడు క్లస్టర్-10, వీకర్‌సెక్షనకాలనీలోని 11, 36 క్లస్టర్లలో ఘనంగా మహానాడు నిర్వహించారు. దూపాడులోని లక్ష్మీవెంకటేశ్వర కల్యాణ మం డపంలో నిర్వహించిన మహానాడులో గౌరుచరిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో వినూ త్నంగా డిజిటల్ మహానాడు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సీఎం చంద్రబాబు సూపర్‌సిక్స్ పథ కాలు అందస్తూనే మరోపక్క అభివృద్ధికి బాటలు వేశారన్నారు. కష్టపడి పనిచేసిన టీడీపీ కార్యకర్తలకు గౌరుచరిత సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ సభ్యుడు చల్లా లక్ష్మీప్రసాద్, కురుబ నారాయణస్వామి, డి.రామాంజ నేయులు, ఈవీ.రమణ, ఆర్.తిరుమలేశ్వరరెడ్డి, ఆర్. లోకేశ్వర రెడ్డి, కె.జనార్ధన ఆచారి, రాఘవేంద్ర ఆచారి, కృష్ణవేణి, డి.శేఖర్, మాజీ ఎంపీపీ వి.మాధవి, వాకిటి మాదేష్, టి.వినోద్‌కుమార్, కాసాని మహే్‌షగౌడ్, జె.గంగాధర్‌గౌడ్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.