పాసింగ్ ఔట్ పరేడ్ రిహార్సల్స్
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:20 PM
ఈ నెల 26న ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో జరిగే ట్రైనీ కానిస్టేబుళ్లకు పాసింగ్ ఔట్ పరేడ్ సంబంధించి ముందస్తు రిహార్సల్స్‌ను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్, బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ హాజరై కవాత్‌ను పరిశీలించారు.
పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు
కర్నూలు క్రైం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 26న ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో జరిగే ట్రైనీ కానిస్టేబుళ్లకు పాసింగ్ ఔట్ పరేడ్ సంబంధించి ముందస్తు రిహార్సల్స్‌ను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్, బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ హాజరై కవాత్‌ను పరిశీలించారు. 2025-26 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ కానిస్టేబుళ్లు ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో 430 మంది, జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో 199 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరందరికీ శనివారం పాసింగ్ ఔట్ పరేడ్‌ను నిర్వహించనున్నారు. ట్రైనీలకు శిక్షణా కాలంలో స హకరించి శిక్షణ ఇచ్చిన పోలీసు అధికారులకు గురువారం ప్రశంసా పత్రా లు అందజేశారు. శిక్షణ కాలంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవా ర్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ హుస్సేన్ పీరా, అసిస్టెంట్ కమాండెంట్లు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.