ప్రజోపయోగానికే పార్టీ కార్యాలయం
ABN , Publish Date - May 06 , 2026 | 11:41 PM
ప్రజోపయో గానికే టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ, రోడ్డు భవనాల శాఖ మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
సేవలు మరింత చేరువ
మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి
నంద్యాల రూరల్ : మే 6 (ఆంధ్రజ్యోతి) :ప్రజోపయో గానికే టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ, రోడ్డు భవనాల శాఖ మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని నూనెపల్టె మార్కెట్ యార్డులో ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం, నందికొట్కూర్ ఎమ్యెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్తా జయసూ ర్యలతో కలిసి కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశా రు. సర్వమత ప్రార్థనల అనంతరం పనులను ప్రారంభిం చారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు కార్యాలయం ఎంతో దోహద పడు తుందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయ తరహాలో అన్ని సౌకర్యా లు కల్పిస్తున్నామన్నారు. కార్యాలయాన్ని 8 నెలలలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబా బు చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. నిర్మాణానికి అన్నివిధాల అనుమతులు తీసుకున్నామన్నారు. అన్ని నియోజకవర్గాలలో పార్టీ కార్యాలయాల భవనాల నిర్మాణానికి స్థలాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ పార్లమెంట్‌లో మహిళాబిల్లు ఓడించామని సంబరాలు చేసుకుంటున్న పార్టీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్య దర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్, రాష్ట్ర విత్తినాభివృద్ధి సంస్థ చైర్మెన్ ధర్మ వరం సుబ్బారెడ్డి, విశ్వ బ్రహ్మణ సంక్షేమ అభివృద్ధి సంఘ చైర్మెన్ పార్వతమ్మ, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.