కార్యాలయ భవనంలో మందు పార్టీ
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:04 AM
పదుల కొద్దీ ఉన్నతాధికారులు వంద మందికి పైగానే సిబ్బంది పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయంలో నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న భవనం మందుబాబులకు అడ్డాగా మారింది.
స్థానిక నాయకులమంటూ బెదిరింపు
నంద్యాల ఎడ్యుకేషన్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): పదుల కొద్దీ ఉన్నతాధికారులు వంద మందికి పైగానే సిబ్బంది పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయంలో నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. నంద్యాల పట్టణంలో ఓ వార్డు ఇన్‌చార్జి సమీప బంధువు అని చెప్పుకుంటూ శుక్రవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయ భవనంలోనే మందు పార్టీ చేసుకున్నారు. నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి పక్కనే ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయంలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మండల విద్యాధికారి కార్యాలయంలో తాము స్థానిక నాయకులమంటూ విందు, మందు సేవించడం కలకలం రేపింది. ఇదేమిటని అడిగిన పాత్రికేయులపై విరుచుకపడుతూ తాము బడా నాయకుని అనుచరులమంటూ వాగ్వాదానికి దిగారు. ఈవిషయంపై విద్యాశాఖాఽధికారులు స్పందించకపోవడం దారుణం.