‘స్వచ్ఛతే సేవ’లో భాగస్వామ్యం కండి
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:11 AM
‘స్వచ్ఛతే సేవ’లో జిల్లా ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఏ. సిరి పిలుపునిచ్చారు.
కలెక్టర్ సిరి
కర్నూలు కల్చరల్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘స్వచ్ఛతే సేవ’లో జిల్లా ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఏ. సిరి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, డీఆర్వో వెంకటనారాయణమ్మతో కలిసి స్వచ్ఛతే సేవ-2026 కార్యక్రమాన్ని దీపాలు వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతే సేవ-2026 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛత ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. పౌరులు తమ ఇళ్లను శుభ్రం చేసుకొని, ఒక దీపాన్ని వెలిగించి స్వచ్ఛమైన జీవన విధానాన్ని పాటిస్తామని సంకల్పం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సందీప్, ఎంహెచవో డాక్టర్ ఎం.రఘు పాల్గొన్నారు.