సమాజ సేవలో భాగం కండి
ABN , Publish Date - May 29 , 2026 | 12:10 AM
సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత భాగం కావాలని హైకోర్టు న్యాయమూర్తి హరిహర నాథశర్మ సూచించారు.
హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాఽథశర్మ
నందికొట్కూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత భాగం కావాలని హైకోర్టు న్యాయమూర్తి హరిహర నాథశర్మ సూచించారు. గురువారం పట్టణ శివారులోని కాళీ ప్రసాద ఆశ్రీతాశ్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పల్లె ప్రియాంక సేవా సమితి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాఽథశర్మ, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఖబర్థి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి, జూనియర్ సివిల్ న్యాయాధికారి దివ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరిహరనాథశర్మ మాట్లా డుతూ మనిషి ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా చివరకు వెంట తీసుకె ళ్లేది ఏమీ ఉండదని, బతికున్నంత కాలం ఎంతో కొంత సమాజ సేవ చేయా లని అన్నారు. శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వినికిడి లోపం ఉన్న విభిన్న ప్రతిభావంతులకు పరికరాలను ఉచితంగా అందజేశారు. శాంతిరాం మెడికల్ కాలేజీ వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు తహసీల్దార్ శ్రీనివాసులు, డా. చైతన్య రెడ్డి, డా. శ్వేత, డా. నిహారిక, సన్మార్క్ సేవా సమితి ప్రెసిడెంట్ నాగన్న, జనసేన నాయకుడు రామిరెడ్డి, వ్యాపారవేత్త సురేష్ తదితరులు పాల్గొన్నారు.