Share News

పార్సిల్‌ బుకింగ్‌ కౌంటర్‌ ప్రారంభం

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:02 AM

నగరంలోని హెడ్‌ పోస్టాఫీసులో పార్సిల్‌ బుకింగ్‌ కౌంటర్‌ను సోమవారం సూపరింటెండెంట్‌ జనార్దనరెడ్డి ప్రారంభించారు.

పార్సిల్‌ బుకింగ్‌ కౌంటర్‌ ప్రారంభం
పార్సిల్‌ బుకింగ్‌ కౌంటర్‌ను ప్రారంభిస్తున్న పోస్టల్‌ సూపరింటెండెంట్‌

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): నగరంలోని హెడ్‌ పోస్టాఫీసులో పార్సిల్‌ బుకింగ్‌ కౌంటర్‌ను సోమవారం సూపరింటెండెంట్‌ జనార్దనరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలు డివిజన పరిధిలో కర్నూలు ప్రధాన తపాల కార్యాలయం. బి. క్యాంప్‌, ఎమ్మిగ నూరు, డోన కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. తపాలశాఖ ద్వారా రాష్ట్రంలోని దేశ, విదేశాలకు ప్రైవేటు సంస్థల కంటే తక్కువ ఖర్చుతో పార్సిల్‌ పంపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపా రు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Apr 14 , 2026 | 12:03 AM