బోధనాసుపత్రుల్లో పేపర్‌లెస్ సేవలు
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:30 AM
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వందశాతం పేపర్‌లెస్ సేవలు అమల్లోకి రానున్నట్లు మెడికల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ డా.విజయలక్ష్మి పేర్కొన్నారు.
మెడికల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ డా.విజయలక్ష్మి
కర్నూలు వైద్య కళాశాలలో వైద్యులు, సిబ్బందికి శిక్షణ
కర్నూలు హాస్పిటల్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వందశాతం పేపర్‌లెస్ సేవలు అమల్లోకి రానున్నట్లు మెడికల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ డా.విజయలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం మెడికల్ కాలేజీ న్యూలెక్చరర్ గ్యాలరీని వైద్యులు ఫార్మసీ, నర్సింగ్ సిబ్బందికి ఈ-హాస్పిటల్‌పై శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యసేవల డిజిటలైజేషన్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఓపీడీ, ఐపీడీ, ఐసీయూ, సర్జరీ, నెక్ట్స్‌జెన్ ప్లాట్‌ఫార్మ్‌లో నమోదు తప్పనిసరి అని తెలిపారు. మనమిత్ర ఇంట్రిగేషన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో వైద్యులు అపాయింట్‌మెంట్ ముందుగానే తీసుకునే ఏర్పాటు ఉందనానరు. ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వరుల, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌్ డా.కృష్ణప్రకాష్, ఐ-హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.ఎం.సత్యనారాయణరెడ్డి, అడ్మినిస్ర్టేటర్ సింధూ సుబ్రహ్మణ్యం, అసోసియేట్ ప్రొఫెసర్ డా.శివబాల పాల్గొన్నారు.