పంచాయతీ బోర్డు స్థలాన్ని కాపాడాలి
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:04 AM
హాలహర్వి మండలం బాపురం పంచాయతీ బోర్డు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట బాపురం గ్రామస్థుల ధర్నా
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): హాలహర్వి మండలం బాపురం పంచాయతీ బోర్డు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం బాపురం గ్రామ వాసి మోసయ్య అధ్యక్షతన ధర్నా చేపట్టారు. సీపీఐ నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని, ఇళ్లు కూడా నిర్మించుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మహేశ, శ్రీనివాసరావు, భీసన్న, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.