ఘనంగా మట్టల ఆదివారం
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:25 AM
మండలంలోని మాధవరం, చెట్నహళ్లి, సూగూరు, రచ్చమర్రి, రాంపురం, తుంగభద్ర, వగరూరు, తిమ్మా పురం, మాలపల్లి, మంత్రాలయం గ్రామాల్లో మట్టల ఆదివారాన్ని కైస్త్రవులు జరుపుకున్నారు.
యేసుక్రీస్తుకు జయమని క్రైస్తవుల నినాదాలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ర్యాలీ
మంత్రాలయం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని మాధవరం, చెట్నహళ్లి, సూగూరు, రచ్చమర్రి, రాంపురం, తుంగభద్ర, వగరూరు, తిమ్మా పురం, మాలపల్లి, మంత్రాలయం గ్రామాల్లో మట్టల ఆదివారాన్ని కైస్త్రవులు జరుపుకున్నారు. సీఎ్‌సఐ చర్చి డివిజనల్ ఛైర్మన్ రెవ. పాస్టర్ వేదనాయకం, జాన్‌వెస్లీ, ఎస్‌డీ రాజన్న, యేసయ్య, సేతునా యక్ ఆధ్వర్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈస్టర్ డే వారం రోజుల ముందుగా జరుపుకునే మట్టల ఆదివారం వేడు కల్లో భాగంగా క్రైస్తవ ఆధ్యాత్నిక భక్తి గీతలు పాడుకుంటూ వీధుల్లో ఊరేగింపు చేశారు. అనంతరం చర్చిల్లో మట్టల ఆదివారం ప్రత్యేకత గురించి బైబిల్‌లోని ప్రవచనాలను వినిపించారు. చర్చి నిర్వాహకులు భూపతి, తిమోతి, జగదీష్, పాల రాజు, కుమార్, యేబు, దేవదాసు, ప్రభుదాసు పాల్గొన్నారు.
ఆలువాలలో ఈతమట్టల పండుగ
గోనెగండ్ల: మండలంలోని అలువాల గ్రామంలో పాస్టర్ తియోతి ఆధ్వర్యంలో క్రైస్తవులు ఈత మట్టల ఆదివారం పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలో ఈతమట్టలతో అలంకరణ చేసి ఏసును కీర్తిస్తు ఈతమట్టలను, ప్లకార్డులను పట్టుకొని ప్రజలు, పిల్లలు, సంఘ పెద్దలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సంఘ పెద్దలు లాజర్, యాకోబు, చిన్న, పోలీసు నాగన్న, జార్జి, కళ్యాణ్, పిల్లలు పాల్గొన్నారు.
కోసిగిలో ఘనంగా మట్టల ఆదివారం
కోసిగి: స్థానిక కడాపాలెం ఎస్సీ కాలనీలో ఆర్‌సీఎం రోమన్ కాథలిక్ మిషన్‌లో క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు. రానున్న గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగల నేపథ్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాస్టర్ జాకబ్ బత్తుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దివ్యసందేశాన్ని ఇచ్చారు. మిషన్ సభ్యులు, క్రైస్తవులు పాల్గొన్నారు.