Share News

శ్రీశైల భ్రమరాంబకు పల్లకీసేవ

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:26 PM

శ్రీశైల భ్రమరాంబకు పల్లకీసేవ

శ్రీశైల భ్రమరాంబకు పల్లకీసేవ
అమ్మవారికి పల్లకీసేవ చేస్తున్న అర్చకులు, అధికారులు

శ్రీశైలం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం అమ్మవారికి పల్లకిసేవను వైభవంగా జరిపించారు. ప్రాకార మండపంలో పుష్పాలతో అలంకరించిన ఊయలలో ఆది దంపతు ఉత్సవమూర్తులను ఆశీనులచేసి షోడశోపచార పూజా క్రతువులు చేశారు. అనంతరంణ పల్లకిసేవలో పర్యవేక్షకులు గంజి రవి, ముఖ్యఅర్చకులు రజనీకాంత్‌, శరత్‌ కూడా పాల్గొన్నారు.

స్వామిఅమ్మవార్లకు నృత్య నీరాజనం

హైదరాబాద్‌కు చెందిన శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్‌ బృందం చేసిన సంప్రదాయ నృత్యాలు భక్తుల ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ మాడవీధిలో ఏర్పాటైన కళారాధన వేదికపై శివశివ శంకరా, శంభో శివ శంభో, లింగాష్టకం, శివతాండవం తదితర గీతాలకు పూజిత, అక్షయ, వేదాంతం వసుం ధర, వేన్నెల, లక్ష్మి, జాహ్నవి, భవ్యశ్రీ, ధాత్రిశ్రీ, శ్రావణి తదితరులు నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 11:27 PM