గౌడుగల్లులో జంట చిరుతలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:30 PM
కోసిగి మండలం లోని గౌడు గల్లు గ్రామంలో గురు వారం రెండు చిరుతలు హల్‌చల్ చేశాయి.
భయంతో పరుగులు తీసిన గ్రామస్థులు
కోసిగి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండలం లోని గౌడు గల్లు గ్రామంలో గురు వారం రెండు చిరుతలు హల్‌చల్ చేశాయి. గ్రామంలోని పెద్దమ్మవ్వ ఆలయ సమీపంలోని కొండలో నుంచి రెండు చిరుత పులులు గ్రామం లోకి రావడంతో ఒక్కసారిగా గ్రామస్థులు భయాం దోళనలకు గురై పరుగులు పెట్టారు. గురువారం రాత్రి 8:30 సమయంలో కొండలో నుంచి రెండు చిరుతలు ఇళ్ల సమీపంలోకి రావడంతో కుక్కలు పెద్దగా మొరిగాయి. రెండు చిరుతలు గ్రామంలోకి వస్తున్న విషయాన్ని గుర్తించిన ప్రజలు అప్రమత్తమై ఇళ్లలోకి పరుగులు వేశారు. కొందరు చీకట్లో టార్చ్‌లైట్లు వేసి కేకలు వేస్తూ చిరుతలను దారిమరిళ్లించేందుకు యత్నించారు. వీటితో పాటు టపా సులు పేల్చి శబ్ధాలు చేశారు. యువకులు చిరుతలు సంచరి స్తున్న వీడియోలను సెల్‌ఫోన్లలో తీశారు. మూడు రోజుల నుంచి చిరుతలు సంచారంతో భయంగా ఉన్నామనీ, ఫారె స్టు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. కొండ సమీపంలోనే ఊరు ఉండ టంతో చిరుతలు ఎప్పుడు దాడులు చేస్తాయోనన్న భయాం దోళన వ్యక్తం చేస్తున్నారు.