Share News

తెల్లగా మారుతున్న వరి కంకులు

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:05 AM

మండలంలో ఈ రబీ సీజన్‌లో బోరుబావులు, చెవువుల కింద తెలుగుగంగ ఆయకట్టు భూముల్లో సుమారు 10వల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకు పంట బాగా రావడంతో రైతులు సంతోషించారు. అయితే వరి కంకి పట్టే సమయంలో పంటపై కాండం తొలుచు పురుగు దాడి చేసింది. దీంతో కంకులు తెల్లబారుతున్నాయి.

తెల్లగా మారుతున్న వరి కంకులు
కాండం తొలిచే పురుగుదాడితో తెల్లగా మారిన కంకులు

వరిపై కాండం తొలిచే పురుగు దాడి

ఆందోళన చెందుతున్న రైతులు

రుద్రవరం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఈ రబీ సీజన్‌లో బోరుబావులు, చెవువుల కింద తెలుగుగంగ ఆయకట్టు భూముల్లో సుమారు 10వల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకు పంట బాగా రావడంతో రైతులు సంతోషించారు. అయితే వరి కంకి పట్టే సమయంలో పంటపై కాండం తొలుచు పురుగు దాడి చేసింది. దీంతో కంకులు తెల్లబారుతున్నాయి.

ఎకరాకు రూ.28వేల పెట్టుబడి

వరి సాగుకు ఎకరాకు రూ.26 వేల నుంచి రూ.28వేలు పెట్టుబడి అవుతోంది. నారుపోసే దగ్గరనుంచి పురుగుమందులు, ఎరువుల ఖర్చు ఉంది. అయితే కాండం తొలిచే పురుగు దాడితో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు పురుగుమందులు వాడినా అదులోకి రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయాధికారులు పొలాల్లో పర్యటించి, సలహాలు, సూచనలు ఇచ్చి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

రెండెకరాల్లో సాగు చేశా

రెండుఎకరాల్లో వరి సాగుచేశా. ఇంతవరకు పంట బాగా వచ్చింది. అయితే కాండం తొలుచు పురుగు దాడి చేయడంతో కంకులు తెల్లబారాయి. అధికంగా తెల్లబారిన కంకులు కనపిస్తుండటంతో దిగుడిపై ప్రభావం చూపుతుంది. - రాజు, వెలగలపల్లె

అదుపులోకి రావడం లేదు

ఆరు ఎకరాలో వరి పంట సాగు చేశాను. ఎన్నిమందులు పిచికారీ చేసినా కాండం తొలుచు పురుగు పురుగు అదుపులోకి రావడం లేదు. వ్యవసాయ అధికారులు సూచనలు ఇవ్వాలి. - దస్తగిరి, కొండమాయపల్లె

పొలంలో నీటిని తగ్గించాలి..

వరిపంటలో కాండం తొలుచు పురుగు నివారణకు కాట్రాఆఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ (3జీగుళికలు) ఎకరాకు ఆరు కిలోలు విత్తులో కలిపి చల్లాలి. వరిపంట పొలంలో నీటిని తగ్గించాలి. అలా చేయడంతో కాండం తొలుచే పురుగును నివారించవచ్చు. - సుమతి, ఏవో, రుద్రవరం.

Updated Date - Mar 28 , 2026 | 12:05 AM