Share News

పీ4 సమర్థవంతంగా అమలు చేయాలి

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:27 PM

రాష్ట్రంలో పేదరిక నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి పేర్కొన్నారు.

పీ4 సమర్థవంతంగా అమలు చేయాలి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పేదరిక నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి పేర్కొన్నారు. గురువారం విజయవాడ నుంచి స్వర్ణాంధ్ర, జీరో పావర్టీ- పీ4 ప్రోగ్రామ్‌, కీ పర్‌ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీయూష్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, సీపీవో ఓబులేసు, నోడల్‌ అధికారులు, నియోజకవర్గ విజన్‌ ఫ్లాన్‌ యూనిట్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర- జీరో పావర్టీ పీ4 కార్యక్రమంలో జిల్లాను ముందంజలో నిలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు.జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని అధికారులకు తెలిపారు. అలాగే కలెక్టరేట్లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి మెడికల్‌ ఆఫీసర్లు, సీహెచ్‌సీ వైద్యులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తదితరులతో కలెక్టర్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీఎంహెచ్‌వో డా. వెంకటరమణ, అదనపు డీఎంహెచ్‌ఓ డా.శారద, డీసీహెచ్‌ఎ్‌స డా.లలిత తదితరులు పాల్గొన్నారు.

మే 3న నీట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించనున్న నీట్‌-యూజీ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

Updated Date - Feb 26 , 2026 | 11:27 PM