Share News

పేదరికం లేని సమాజానికి పీ4

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:35 PM

పేదరికం లేని సమాజ నిర్మాణమే పీ-4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు.

పేదరికం లేని సమాజానికి పీ4
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రులు, కలెక్టర్‌, ఎస్పీ, జేసీ

క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ప్రజల భాగస్వామ్యం

జిల్లా ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్‌

నంద్యాల నూనెపల్లి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పేదరికం లేని సమాజ నిర్మాణమే పీ-4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. సోమవారం ఆయన నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన పీ-4 వార్షికోత్సవ స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించిన పీ4 కార్యక్రమంపై మొదట అనుమానాలు వ్యక్తమైనప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. గతంలో గ్రామాల్లో ఉండిన స్వయం సమృద్ధి, సహకార భావాన్ని తిరిగి తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక సంస్కృతిక ఉద్యమంగా కొనసాగడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ప్రారంభించిన జీరో పావర్టీ పీ4 కార్యక్రమం సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలు చేయూత అందిస్తే, పేద కుటుంబాలు కూడా ఎదిగి మరికొందరికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. జిల్లాలో 50,038 బంగారు కుటుంబాలను గుర్తించి, వాటిలో 49,865 కుటుంబాలను ఇప్పటికే 4,805 మంది మార్గదర్శకులతో అనుసంధానం చేశామని వెల్లడిం చారు. ఉపాధి, వైద్య సహాయం, విద్య, చిన్న వ్యాపారాలు వంటి అవసరాలకు మార్గదర్శకులు తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం మంత్రులు, కలెక్టర్‌ సమక్షంలో సమాజ సేవలో విశేషం గా కృషి చేసిన మార్గదర్శకులకు ప్రశంసాపత్రాలు అందజేసి వారి సేవలను కొనియాడారు.

అనంతరం రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ.. పీ-4 కార్యక్రమం ముఖ్యమంత్రి ఆలోచనల ఫలితంగా రూపుదిద్దుకుని సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. సమాజంలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న సేవా మూర్తులను గుర్తించి వారికి ప్రభుత్వ స్థాయిలో గౌరవం ఇవ్వడం ఆనంద దాయకమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యల పరిష్కా రం, చెరువుల పునరుద్ధరణ వంటి పనులను ప్రాధాన్యంగా చేపడుతున్న అధికారుల కృషిని ఆయన అభినందించారు. ఉచిత అంబులెన్స్‌ సేవలందిస్తున్న దాతలను ప్రశంసిస్తూ, ప్రైవేట్‌ అంబులెన్స్‌ మాఫియా కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా కట్టడి చేయాలని అధికారులకు సూచించారు. వికలాంగులకు నెలకు సుమారు 10 ట్రై-సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న దాతల సేవలను కొనియాడిన మంత్రి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న విద్యాసంస్థల పాత్రను ప్రశసించారు.

ముఖ్యమంత్రితో సంభాషణ

పీ-4 కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నుంచి నిర్వహించిన లైవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని ఎం.కృష్ణాపురం గ్రామానికి చెందిన మార్గదర్శి దండె రంగారెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ.. పీ-4 కార్యక్రమం తనకు ఎంతో స్ఫూర్తిని స్తున్నదని తెలిపారు. ఈ ప్రేరణతో గ్రామంలో నీటి కొరత తీర్చేందుకు ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ప్రతి నెలా రూ.1000 నుంచి రూ.2000 వరకు సహాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి ప్రతి గురువారం స్వీట్లు అంద జేస్తున్నామన్నారు. భవిష్యత్తులో గ్రామంలో ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే యోచనలో ఉన్నామన్నారు. ప్రభుత్వం అందించే పింఛన్లకు అద నంగా వృద్ధులు, దివ్యాంగులకు తన సొంత నిధులతో నెలకు రూ.2 వేల చొప్పున అందజేస్తున్నామన్నారు. రంగారెడ్డి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రి అభినందించారు. అలా గే మరో గ్రామాన్ని దత్తత తీసుకొని నీటి సరఫరా, ఇళ్ల నిర్మా ణం, ఆర్థిక సాయం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రాజేందర్‌ రెడ్డి సేవలను అభినందించారు.

Updated Date - Mar 30 , 2026 | 11:35 PM