Share News

కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ లీకేజీ

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:56 PM

నగరంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ పైపులైన్‌ లీకేజీ కలకలం రేపింది. ఆదివారం ఉదయం ఆసుపత్రికి ఆక్సిజన్‌ సప్లయ్‌ అయ్యే జాయింట్లు వద్ద లీకేజీ కావడం, ఆ సమయంలో వెంటిలేటర్‌పై రోగులు ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో తరుచూ ఆక్సిజన్‌ లీకేజీ ఘటనలు చోటుచసుకుంటున్నాయి.

కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ లీకేజీ
మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

పెద్దాసుపత్రిలో తరచూ లీకేజీ అవుతుండటంతో ఆందోళన

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ పైపులైన్‌ లీకేజీ కలకలం రేపింది. ఆదివారం ఉదయం ఆసుపత్రికి ఆక్సిజన్‌ సప్లయ్‌ అయ్యే జాయింట్లు వద్ద లీకేజీ కావడం, ఆ సమయంలో వెంటిలేటర్‌పై రోగులు ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో తరుచూ ఆక్సిజన్‌ లీకేజీ ఘటనలు చోటుచసుకుంటున్నాయి. కోతులు ఆక్సిజన్‌ పైపులైన్‌లను పట్టుకుని వేలాడుతుండటంతో జాయింట్లు దెబ్బతింటున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. వారం క్రితం పిడీయాట్రిక్‌ విభాగం వద్ద కూడ లీకేజీ కావడంతో అధికారులు, నిపుణులను పంపించి మరమ్మతులు చేయించారు. అలాగే 20 రోజుల క్రితం ఇదే పీడీయాట్రిక్‌ విభాగం వద్ద. అలాగే సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ వద్ద కూడా ఆక్సిజన్‌ లీకేజీ అయింది. లీకేజీ సమస్యను పరిష్కరించడానికి ఏ సంస్థకు, ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించకపోవడంతో లీకేజీ సమస్యగా మారింది. ఇలా లీజేకే కావడంతో విలువైన ప్రజాధనం వృథా అవుతోంది. ఇప్పటికైనా ఆసుపత్రి అధికారులు ఆక్సిజన్‌ పైపులైన్ల నిర్వహణను ఓ సంస్థకు అప్పగించి, పర్యవేక్షించాలని రోగులు కోరుతున్నారు.

Updated Date - Jan 11 , 2026 | 11:56 PM