Share News

బావిలో పడిన ఎద్దులు

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:18 AM

: పొలం పనులు చేసేందుకు వెళ్లిన ఎద్దులు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడ్డాయి. ఈ ఘటన మండల కేంద్రమైన పగిడ్యాలలో గురువారం చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

 బావిలో పడిన ఎద్దులు
క్రేన్‌ సాయంతో ఎద్దును తీస్తున్న దృశ్యం

క్రేన్‌ సహాయంతో బయటకు తీసిన గ్రామస్థులు

పగిడ్యాల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పొలం పనులు చేసేందుకు వెళ్లిన ఎద్దులు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడ్డాయి. ఈ ఘటన మండల కేంద్రమైన పగిడ్యాలలో గురువారం చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. వివరాలు.. లక్ష్మాపురం పొలిమేర సమీపంలో ఉన్న సాంబశివారెడ్డి పొలానికి ఉదయం పగిడ్యాలకు చెందిన కుమ్మరి ఆంజనేయులు సేద్యం పనుల నిమిత్తం ఎద్దులను తీసుకొని పొలానికి వెళ్లారు. పొలంలో ఉన్న బావి సమీపంలో పొలాన్ని దున్నుతుండగా ఎద్దులు భయపడి 20 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయాయి. నీరు తక్కువగా ఉన్నాయి. ఎంపీటీసీ స్వాములు, గ్రామస్థుల ఆర్థికసాయంతో క్రేన్‌ తెచ్చి బావిలో నుంచి ఎద్దులను బయటకు తీశారు. వాటికి గాయాలయ్యాయి.

Updated Date - Nov 27 , 2026 | 12:18 AM