Share News

అటో.. ఇటో..

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:02 AM

నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నా కొంతమంది వాహనదారుల్లో ఇసుమంతయినా మార్పు రాకపోవడం విచారకరం.

అటో.. ఇటో..
ట్రాలీ ఆటోలో పరిమితికి మించి లోడ్‌

పరిమితికి మించి లోడ్‌

కొలిమిగుండ్ల, మే 31 (ఆంధ్రజ్యోతి): నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నా కొంతమంది వాహనదారుల్లో ఇసుమంతయినా మార్పు రాకపోవడం విచారకరం. ఆదివారం మండల కేంద్రంలోని అనంతపురం - అమరావతి ప్రధాన రహదారిపై ఓ ట్రాలీ ఆటలో 15 అడుగుల ఎత్తువరకు ప్లాస్టిక్‌ సామాన్లు లోడ్‌ చేసుకుని వెళ్లడం ఆందోళనకు గురిచేసింది. అసలే గాలికాలం కావడంతో ఆటో ఏమాత్రం అదుపు తప్పినా వెనుక ముందు వచ్చే వాహనాలు ప్రమాదానికి గురై ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది. పోలీసు, రవాణా శాఖ అధికారులు ఇలాంటి వాహనదారులపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:03 AM