Share News

రొమ్ము క్యాన్సర్‌ను జయించొచ్చు

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:12 AM

ముందస్తు గుర్తింపు, సరైన చికిత్స, కుటుంబ సభ్యుల మద్దతుతో రొమ్ము క్యాన్సర్‌ను జయించొచ్చు అని కర్నూలు మెడికల్‌ కాలేజీ (కేఎంసీ) ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ అన్నారు.

రొమ్ము క్యాన్సర్‌ను జయించొచ్చు
వైద్యసదస్సును ప్రారంభిస్తున్న ప్రిన్సిపాల్‌, సూపరింటెండెంట్‌

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ముందస్తు గుర్తింపు, సరైన చికిత్స, కుటుంబ సభ్యుల మద్దతుతో రొమ్ము క్యాన్సర్‌ను జయించొచ్చు అని కర్నూలు మెడికల్‌ కాలేజీ (కేఎంసీ) ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ అన్నారు. మంగళవారం కేఎంసీ న్యూలెక్చరర్‌ గ్యాలరీలో స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఐఎంఏ కర్నూలు బ్రాంచ్‌, జనరల్‌ సర్జరీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో హోలిస్టిక్‌ అప్రోచ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై వైద్యవిజ్ఞాన సదస్సు జరిగింది. ఆమె మాట్లాడుతూ మహిళల క్యాన్సర్లలో 26 శాతం బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులేనని, ప్రతి నాలుగు నిమిషాలకు ఒక బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసు నమోదవుతుందన్నారు. ప్రతి 8 నిమిషాలకు ఈ క్యాన్సర్‌తో మరణిస్తున్నారన్నారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రతి మహిళ అనుభవం ప్రత్యేకమైందన్నారు. ప్రభుత్వం ముందస్తు అంచనాతోనే స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పిందన్నారు. ఎంతో ఖరీదైన క్యాన్సర్‌ వైద్యచికిత్స ఉచితంగా అందిస్తున్నామన్నారు. స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డా.కృష్ణ ప్రకాష్‌ మాట్లాడుతూ ఓపీ నెంబర్‌ 222లో ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి స్ర్కీనింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఐఎంఏ కర్నూలు బ్రాంచ్‌ అధ్యక్ష కార్యదర్శులు డా.రామచంద్ర నాయుడు, డా.ఎ్‌సవీ రామ్మోహన్‌ రెడ్డి, ఐఎంఏ ఉమెన్‌ వింగ్‌ అధ్యక్ష కార్యదర్శులు డా.మాదవీ శ్యామల, డా.విష్ణుప్రియ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డా.చైతన్యవాణి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ లక్ష్మీబాయి, వైస్‌ ప్రిన్సిపల్‌ డా.హరిచరణ్‌, డా.శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2026 | 12:12 AM