ఓవర్‌హెడ్ ట్యాంకు ప్రారంభం
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:01 AM
మండలంలోని నందివర్గంలో రూ.75 లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకు, రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం ప్రారం భించారు.
బనగానపల్లె, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నందివర్గంలో రూ.75 లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకు, రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ ఉమామహేశ్వరరావు, శేషిరెడ్డి, సుబ్రమణ్యం, లక్ష్మిరెడ్డి, వెంకటయ్య, జమాల్ ఆధ్వ ర్యంలో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేస్తా మని మంత్రి తెలిపారు. సీతారామయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి, వంగాల పరమేశ్వరరెడ్డి, సంగు శ్రీనివాస రెడ్డి, పీఆర్ డీఈ నాగశ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ మధుసూధన్, ఏఈ సాయికృష్ణ, ఎంపీడీవో నాగరాజు, డిప్యూటీ ఎంపీడీవో బాలాంజనేయులు, సెక్రటరీ గురుప్రసాద్ పాల్గొన్నారు.