ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించండి
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:02 PM
పెద్దపాడు నుంచి హైదరాబాదు ఎన్‌హెచ్‌కు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రా రంభించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు కలెక్టరేట్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): పెద్దపాడు నుంచి హైదరాబాదు ఎన్‌హెచ్‌కు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రా రంభించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవా రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో డిస్ర్టిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఉలిందకొండ వద్ద ఫిస్తా హౌస్ నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు ఇల్యూమినేషన్ పనులు వెం టనే చేపట్టాలని హైవే, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ నేషనల్ హైవే పిస్తా హౌస్ నుంచి చిన్నటేకూరు వరకు నన్నూరు టోల్ గేట్ వద్ద హై మాస్ ఇల్యూమి నేషన్ లైటింగ్ ఏర్పాటు చేసేలాచర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవే అప్రోచ్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. స్పీడ్ బ్రేకర్లకు పెయింటింగ్ వేయాలన్నారు. నేషనల్ హైవే స్ర్టెచ్‌లలో మీడియన్స్ నిర్వహణ సక్రమంగా నిర్వహించా లన్నారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, డీటీసీ శాంత కుమారి, ఎన్‌హెచ్ పీడీలు పాల్గొన్నారు.