Share News

మాది అభివృద్ధి.. వైసీపీది విధ్వంసం

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:53 PM

‘అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం. విధ్వంసం, విష ప్రచారం గొడ్డలి పార్టీ అజెండా.. కూటమి పార్టీల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి.

మాది అభివృద్ధి.. వైసీపీది విధ్వంసం
మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

గొడ్డలి పార్టీతో అప్రమత్తంగా ఉండాలి

కుట్రలు, కుతంత్రాలు వైసీపీ సిద్ధాంతం

డీఎస్సీ-2024 అడ్డుకోవడానికి 32 కేసులు

వైసీపీ హయాంలో వెంటిలేటర్‌పై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

ప్రధాని సహకారంతో చక్కదిద్దిన ఘనత బాబుదే

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

అట్టహాసంగా రెండేళ్ల విజయోత్సవ సభ

కర్నూలు/కర్నూలు అర్బన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం. విధ్వంసం, విష ప్రచారం గొడ్డలి పార్టీ అజెండా.. కూటమి పార్టీల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి..’ అని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపుని చ్చారు. సోమవారం స్థానిక కర్నూలు కన్వెన్షన్‌ హాల్‌లో ‘రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, దేశంలో 12 ఏళ్ల విశ్వాస్‌, వికాస్‌, జన్‌ కళ్యాణ్‌’ కార్యక్రమం టీడీపీ జిల్లా అధ్యక్షరాలు గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన జరిందింది. సభావేదిక ఆవరణలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, ఎంపీ, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులతో మంత్రి నిమ్మల పరిశీలించారు. అనంతరం జరిగిన రెండేళ్ల విజయోత్సవ సభలో నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలను వివరించారు. అదే క్రమంలో అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీని ఎండగట్టారు. ప్రతి కూటమి కార్యకర్త గొడ్డలి పార్టీ పట్ల అప్రమత్తంగా ఉంటూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉండగా ఐదేళ్లు ప్రజలను పీడించి, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క డీఎస్పీ కూడా నిర్వహించాడానికి చేతకాని వైసీపీ ఈ రోజు ఎంతో పారదర్శకంగా, పకడ్బం దీగా నిర్వహించిన డీఎస్సీ-2024లో అక్రమాలు జరిగాయని ఆరోపించడం వారి నిజస్వరూపానికి నిదర్శనమన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ రాకుండా 32, నోటిఫికేసన్‌ వచ్చాక 16 కేసులు వేసి అడ్డుకోవాలని వైసీపీ ప్లాన్‌ చేసిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ రాష్ట్రాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, ప్రధాని మోడీ సహకారంతో సీఎం చంద్రబాబు బాగు చేసి వెంటిలేటర్‌ నుంచి ఐసీయూలోకి తీసుకెళ్లారని, త్వరంలోనే దేశంలోనే ఏపీ నంబరు.1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అన్నారు. వైపీసీ ఐదేళ్లలో రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి మన నెత్తిన ఒక్కక్కరిపై రూ.2.25 లక్షల అప్పులు పెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజుయాదవ్‌ సహా వివిధ కార్పొరేషన్‌ డైరెక్టర్లు, టీడీజీ, జనసేన, బీజేపీ పార్టీ ముఖ్యనాయకులు హాజరయ్యారు.

13 పారిశ్రామిక నోడ్‌లో ఓర్వకల్లు

దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం 13 పారిశ్రామిక నోడ్‌లో ఏర్పాటు చేస్తే అందులో ఒకటి ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌. ఎంతో అభివృద్ధి చెందుతోంది. పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి పాటు పడాలి. త్వరలోనే వేదవతి ప్రాజెక్టు పనులు చేపట్టి పూర్తి చేస్తాం.

- బస్తిపాటి నాగరాజు, కర్నూలు ఎంపీ

వైసీపీ హయాంలో పనులు నిల్‌

వైసీపీ అధికారంలో ఉండగా సాగునీటి ప్రాజెక్టుకు గంపెడు సిమెంట్‌ కూడా వేయలేదు. మంత్రి నిమ్మల సారథ్యంలో జిల్లా ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం అవుతాయి. కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలు సూపర్‌ సక్సెస్‌ చేసింది. ఇచ్చిన హామీలు 85 శాతానికి పైగా అమలు చేసిన ఘనత మనదే.

- గుడిసె కృష్ణమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు

వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు అమలు చేస్తున్నాం. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని గొడ్డలి పార్టీ రోడ్లపైకి వచ్చింది. వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. 24 నెలల్లో రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత చంద్రబాబుది. మన ప్రభుత్వం చేసే మంచి పథకాలు, అభివృద్ధి ప్రజలకు వివరించాలి.

- గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్యే

మోదీ, చంద్రబాబు పాలన అద్భుతం

కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సారథి సీఎం చంద్రబాబు పాలన అద్భుతం. 4,443 రోజులు ప్రధానిగా మోడీ రికార్డు సృష్లించారు. గతంలో కుంభకోణాలు, అభివృద్ధి లేమి, అక్రమాలు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ పాలనతో స్వర్ణయుగం గుర్తుకొస్తుంది. ఒక వైపు అభివృద్ధి, మరో వైసు సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్తోది.

- డాక్టర్‌ పార్థసారఽఽథి, ఎమ్మెల్యే

నలుగురు మొనగాళ్లు

యుద్ధ సమయంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ప్రధాని మోడీ, రాష్ట్రంలో అప్పులను అధిగమించి సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు, గ్రామ సీమలకు పల్లెపండుగ తెచ్చిన డిప్యూటీ సీఎం వపన్‌కళ్యాణ్‌, ఇంట్లో ఎందరు ఉన్నా అందరికి తల్లికి వందనం ఇచ్చిన విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ఈ మనకు మొనగాళ్లు. మన ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారు.. జగ్రత్తగా ఉండాలి.

- బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే

కూటమితో సుపరి పాలన

కూటమి ప్రభుత్వం ద్వారానే సుపరి పాలన సాఽధ్యం. జగన్‌ పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.. ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. మనం చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక పోతున్నాం. కూటమి అంటే ఉమ్మడి కుటుంబాలు గుర్తుకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో పత్తికొండలో రూ.1,600 కోట్లు, డోన్‌లో రూ.1,800 కోట్లు అభివృద్ధి చేసినా మనం చెప్పకోకపోవడం వల్లే ఓడిపోయాం. ఆ పొరపాటు ఇక చేయకూడదు.

- కేఈ శ్యాంబాబు, పత్తికొండ, ఎమ్మెల్యే

వంద శాతం మేనిఫెస్టో అమలు

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేశాం. జగన్‌ పార్టీ విధ్వంస రచనతో ముందుకు వెళ్తోంది. మంత్రి లోకేశ్‌ పెట్టుబడులు తెచ్చి యువతకు అండగా నిలస్తే, డిప్యూటీ సీఎం వపన్‌ కళ్యాణ్‌ గ్రామీణావృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు.

- బొగ్గుల దస్తగిరి, ఎమ్మెల్యే

రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు

ప్రధాని మోడీ సహకారంతో రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు దూసుకుపోతోంది. వైసీపీ వెన్నుపోటు అంటుంది..? మీరు రైతులు భూములు లాక్కోవడానికి తెచ్చిన ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ రద్దు చేయడాన్ని వెన్నుపోటు అంటారా..? రాయలసీమకు పరిశ్రమలు, రాష్ట్రానికి గూగుల్‌ తీసుకురావడం వెన్నుపోటా..? స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వెన్నుపోటా..? గొడ్డలి పార్టీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

- వైకుంఠం జ్యోతి, ఆలూరు టీడీ పీ ఇన్‌చార్జి

చేతకాని దద్దమ్మలు

రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక చేతకాని దద్దమ్మలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. గొడ్డలి పార్టీ అధికారంలోకి రావడం ఇక కలే. సీఎం చంద్రబాబు ఎలా కష్టపడుతున్నాడో అందరూ అలాగే కష్టపడాలి.

- ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

ఇదే తరహాలో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. స్థానిక ఎన్నికలు ఇచ్చే నాటికి ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మూడు నాలుగు సమావేశాలు నిర్వహించి ఐక్యతను బలోపేతం చేయాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో వంద శాతం విజయం సాధించాలి.

- మీనాక్షినాయుడు, మాజీ ఎమ్మెల్యే, ఆదోని ఇన్‌చార్జి

Updated Date - Jun 15 , 2026 | 11:53 PM