Share News

మాది రైతు ప్రభుత్వం: మంత్రి బీసీ

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:06 AM

మాది రైతు ప్రభుత్వం: మంత్రి బీసీ

మాది రైతు ప్రభుత్వం: మంత్రి బీసీ
శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బీసీ

బనగానపల్లె, ఫిబ్రవరి 21, (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభు త్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, మార్క్‌ఫెడ్‌ జిల్లా అధికారి హరి నాథరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలోని మార్కెట్‌ యార్డు లో శనగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు నుంచి శనగలను మద్దతు ధర రూ.5875లతో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. నం ద్యాల జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల క్వింటాళ్ల శనగలను రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామ సచివా లయాల ద్వారా శనగలను కొనుగోలు చేస్తామన్నారు. బనగానపల్లె మండలంలో 10,625 ఎకరాల్లో, సంజామల మండలంలో 29,873 ఎకరాల్లో, కోవెలకుంట్ల మండలంలో 22,476 ఎకరాల్లో, కొలిమిగుండ్ల మండలంలో 11,171 ఎకరాల్లో, అవుకు మండలంలో 4289 ఎకరాల్లో శనగ పంట వేసినట్లు తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గంలో శనగ 77వేలకు పైగా ఎకరాల్లో శనగ పంట వేసినట్లు తెలిపారు. ఈక్రాప్‌ చేయించుకున్న ప్రతి రైతు శనగలను కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఇంకా ఈక్రాప్‌ నమోదు చేయించుకోకుంటే ఈక్రాప్‌ నమోదు చేయించుకోవాలని అన్నారు. మద్దతు ధరతో శనగలు కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల అకౌంట్లలో నగదు జమ చేస్తామన్నారు. అలాగే కందులను కూడా క్వింటా 8వేలకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, ఎస్సార్బీసీ ప్రాజెక్టు చైర్మన్‌ జల్లెళ్ల కాట్రెడ్డి రాజవేఖర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు వైస్‌ చైర్మన్‌ భూషన్న తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌ యార్డు గోదాములు రైతులకు అంకితం బనగానపల్లె మార్కెట్‌యార్డు గోదాములను రైతులకు అంకితం చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. బనగానపల్లె మార్కెట్‌ యార్డులో 3వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల రెండు గోదాములను మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పది ఏళ్ల క్రితం రెండు గోదాములకు నిధులు మంజూరు చేయించి గోదాముల నిర్మాణం పనులు ప్రారంభించామన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదాముల నిర్మాణం పట్టించుకోలేదన్నారు. తిరిగి తాను మంత్రి అయిన తర్వాత గోదాములు నిర్మించి రైతులకు అంకితం చేశామన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:06 AM