గ్రంథాలయాల అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:08 AM
గ్రంథాలయాల అభివృద్ధే ప్రభు త్వ లక్ష్యమని గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర తెలిపారు. మంగళవారం చాగలమర్రిలోని టీజీపీ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు.
చాగలమర్రి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాల అభివృద్ధే ప్రభు త్వ లక్ష్యమని గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర తెలిపారు. మంగళవారం చాగలమర్రిలోని టీజీపీ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. అనంతరం పాత గ్రంథాలయంలో రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 39 గ్రంథాల యాలున్నాయని, అందులో కొన్ని సొంత భవనాల్లో కొనసా గుతున్నాయని అన్నారు. ఆయా గ్రామ పంచాయతీలు ముందుకొస్తే కొత్తగా గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నంద్యాల జిల్లాలో చాగలమర్రి, పగిడెల, పాములపాడు మండల కేంద్రాల్లో రూ.59లక్షలతో భవనాలు నిర్మించామన్నారు. కర్నూలులో కొత్త భవనాల నిర్మాణం కోసం రూ.60లక్షలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.15కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయన్నారు. బకాయిల విషయంపై జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి ఈనెల చివరి నాటికి బకాయిలు వసూలు చేస్తా మని అన్నారు. జిల్లా గ్రంథాలయ అధికారి ప్రకాష్, టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా, ఈవో తారకేశ్వరి, ఏఈ హరి, గ్రంథాలయ అధికారులు రామచంద్రుడు, అల్లాబకాష్, లాలయ్య ఉన్నారు.