Share News

పకడ్బందీగా నిర్వహించండి

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:37 PM

ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా నిర్వహించండి
నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఏ.సిరి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ. సిరి

గూడూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం గూడూరులోని ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో జరుగుతున్న నామినేషన్‌ ప్రక్రియను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అభ్యర్థులు సమర్పించిన నామినేషన్‌ ఫారాలు, డిపాజిట్‌ రసీదులు, ధ్రువపత్రాలు, సంతకాలు, ఓటరు జాబితాలోని వివరాలను సంబంధిత నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మూడో రోజు నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు.కర్నూలు ఆర్డీవో సందీ్‌పకుమార్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రియంవద, తహసీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 11:37 PM