Share News

అవయవ దానం మహోన్నత కార్యం

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:11 AM

అవయవ దానం మహోన్నత కార్యం అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

అవయవ దానం మహోన్నత కార్యం
అంగీకార పత్రంపై సంతకం చేస్తున్న మంత్రి ఫరూక్‌

న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : అవయవ దానం మహోన్నత కార్యం అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ప్రపంచ అవయవ దానం దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఐ సపోర్ట్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ సెల్ఫీ పాయింట్‌ వద్ద మంత్రి ఫొటో దిగి అవయవ దానం చేసేందుకు అంగీకార పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు, అనుకోని పరిస్థితుల్లో బ్రైన్‌డెడ్‌ అయినవారు కానీ మానవతా దృక్పథంతో స్పందించేవారు కాని అవయవ దానం చేయ డానికి అర్హులన్నారు. అవయవ దానంపై మరింత విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెడ్‌క్రాస్‌ యాజమాన్యం అవయవ దానంపై చేస్తున్న ప్రచా రం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్‌ బాబన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 12:11 AM