వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:33 AM
ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి అరికెర గ్రామ వైసీపీ కార్యకర్తలు నిరసన సెగ చూపించారు. సోమవారం రాత్రి ఆలూరు మండలం అరికెర గ్రామంలో సర్‌పై అవగాహన బంగారమ్మవ్వ ఆలయం వద్ద నిర్వహించారు.
అడ్డుకున్న అదే పార్టీ కార్యకర్తలు
ఆలూరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి అరికెర గ్రామ వైసీపీ కార్యకర్తలు నిరసన సెగ చూపించారు. సోమవారం రాత్రి ఆలూరు మండలం అరికెర గ్రామంలో సర్‌పై అవగాహన బంగారమ్మవ్వ ఆలయం వద్ద నిర్వహించారు. ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన వైసీపీ మండల కో కన్వీనర్ అరికెర వీరే్‌షతో పాటు బంధువులు, అనుచరులు ఒక్కసారిగా ఎమ్మెల్యే వాహనాన్ని చుట్టుముట్టారు. దీంతో 10 నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ కారణం చేత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఇందుకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను పట్టుబట్టారు. ఆలూరులో జరిగిన మీటింగ్‌లో గొడవ పెట్టుకున్నందుకే జిల్లా అధ్యక్షుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు. స్థానిక వైసీపీ నాయకులు వివాదాన్ని సద్దుమణిగించి అక్కడి నుంచి ఎమ్మెల్యేను పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.