ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత: మాజీ మంత్రి
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:21 AM
ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
డోన రూరల్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవా రం పట్టణ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపం పరిసర ప్రాంతంలో వైసీపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఉడుములపాడు, జగదుర్తి, కామగానిగుండ్ల, తిమ్మాపురం, ఆవులదొడ్డి, తదితర గ్రామాల వైసీపీ కార్యకర్తల తో ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, సర్పంచు, జడ్పీటీసీ ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సమాయత్తం కావాలన్నారు. ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బద్దెల రాజ్‌కుమార్, రాష్ట్ర మీట్ కార్పొరేషన మాజీ చైర్మన శ్రీరాములు, మున్సిపల్ వైస్ చైర్మన జాకీర్ హుశేన పాల్గొన్నారు.