జిల్లావ్యాప్తంగా ఆపరేషన వజ్ర ప్రహార్
ABN , Publish Date - May 02 , 2026 | 11:40 PM
జిల్లా వ్యాప్తంగా ఆపరేషన వజ్ర ప్రహార్ నిర్వహించారు. డీఎస్పీలు ఆధ్వర్యంలో సంబంధిత సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ బృందాలు ఈ వజ్రపహార్‌లో పాల్గొన్నారు.
53 వాహనాలు సీజ్
కర్నూలు క్రైం, మే 2(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆపరేషన వజ్ర ప్రహార్ నిర్వహించారు. డీఎస్పీలు ఆధ్వర్యంలో సంబంధిత సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ బృందాలు ఈ వజ్రపహార్‌లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1500 ఇళ్లను తనిఖీలు చేసి 53 వాహనాలు సీజ్ చేశారు. కర్నూలు వనటౌన పోలీస్ స్టేషన పరిధిలో ఇనచార్జి డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు మారుతి శంకర్, విక్రమసింహ, శేషయ్య, ఎస్‌ఐల ఆధ్వర్యంలో జొహరాపురం, ఇందిరమ్మ గృహాల్లో తనిఖీలు చేపట్టారు. ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేశారు. నార్కోటిక్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారి ఇళ్లలో సోదాలు చేశారు. పది మంది రౌడీషీటర్లు, ఇద్దరు సస్పెక్ట్స్ ఇళ్లను తనిఖీలు చేశారు. 80 వాహనాలు తనిఖీలు చేసి పది వాహనాలు సీజ్ చేశారు. అనంతరం ప్రజలతో కలిసి ఆపరేషన వజ్ర ప్రహార్ ప్రతిజ్ఞ చేయించారు. మాధవరం పోలీస్ స్టేషన పరిధిలో రచ్చుమర్రి గ్రామంలో ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. 21 మోటారు సైకిళ్లు, 8 వాహనాలు సీజ్ చేశారు. ఆదోని సబ్‌డివిజన పరిధిలో ఎస్వీ పోలీస్ స్టేషన కపటి గ్రామంలో, పత్తికొండ సబ్ డివిజన పరిధిలో కప్పట్రాళ్ల గ్రామంలో తనిఖీలు చేశారు.