జిల్లావ్యాప్తంగా ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:23 PM
జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి ఆయా పోలీసు స్టేషన్‌లకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.
ఫ ముఖ్య ప్రదేశాలను తనిఖీ చేసిన పోలీసులు
నంద్యాల క్రైం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి ఆయా పోలీసు స్టేషన్‌లకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ వజ్ర పహార్‌లో భాగంగా ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా హాట్‌స్పాట్‌లు, అనుమానితులు, రౌడీషీటర్లు, పాత నేరస్థుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర ్భంగా పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్ పట్టణాల్లో ఆయా పోలీసు సబ్ డివిజన్ అధికారుల నేతృత్వంలో సోదాలు చే శారు. నంద్యాల అడిషనల్ ఎస్పీ ఎం.జావళి ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఎస్‌ఐ, 25 మంది సిబ్బందితో మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని హాట్‌స్పాట్ ఏరియా బైటిపేటలో అనుమానితుల ఇళ్లు, వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలులేని ఒక వాహనాన్ని సీజ్ చేశారు. బయటిపేటలో 200 మందితో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఆత్మకూరు మండలంలోని క్రిష్ణాపురం, అమలాపురం గ్రామాల్లో డీఎస్పీ రామాంజినాయక్, ఆళ్లగడ్డలో హాట్‌స్పాట్ ఏరియా అయిన టిడ్కో ఇళ్ల సముదాయం, పరిసర ప్రాంతాల్లో సీఐ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, సిబ్బంది, డోన్ పట్టణంలో ఎస్‌డీపీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, లోక్‌ల్, జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానితులు, రౌడీషీటర్ల ఇళ్లు సోదాలు చేశారు. అలాగే గంజాయి, మాదకద్రవ్యాలను వినియోగించమని, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయా ప్రాంతాల్లో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఎల్లవేళలా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.