ఆపరేషన్ వజ్ర ప్రహార్..
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:11 PM
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్‌లలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను విస్తృతంగా చేపట్టారు.
మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ డే
సరైన పత్రాలు లేని 76 వాహనాలు స్వాధీనం
35 లిక్కర్ బాటిల్స్ సీజ్.. ఒక బైండోవర్ కేసు నమోదు
కర్నూలు క్రైం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్‌లలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను విస్తృతంగా చేపట్టారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది మొత్తం 240 మంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానాస్పద 870 మంది వ్యక్తులను, 345 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 లిక్కర్ బాటిల్స్‌ను సీజ్ చేశారు. 1000 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను, 300 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఏపీ ఈగల్ టోల్ ప్రీ నెంబర్.1972కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుశేన్‌పీరా, డీఎస్పీ బాబు ప్రసాద్, పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు ఇన్‌చార్జి డీఎస్పీ ఉపేంద్రబాబు పాల్గొన్నారు.