Share News

మహిళల రక్షణ కోసం ఆపరేషన్‌ దండయాన

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:04 AM

మహిళ రక్షణ కోసం ఆపరేషన్‌ దండయాన ఉందని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు.

మహిళల రక్షణ కోసం ఆపరేషన్‌ దండయాన

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కోడుమూరు, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): మహిళ రక్షణ కోసం ఆపరేషన్‌ దండయాన ఉందని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. స్థానిక వాసవి కల్యాణ మండలంలో మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, భద్రత, చట్టాలపై గురువారం మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అవగాహన ఉం డాలన్నారు. యువతకు పోక్సో చట్టం, వివిధ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఎక్కడైన నేరం జరిగినా లేదా నేరం జరిగే అవకాశం ఉందని భావించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలీసులకు సమాచారం అందించిన వాళ్ల పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. డీఎస్పీ బాబుప్రసాద్‌ మాట్లాడుతూ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కోడుమూరు మండలం గోరంట్లలో ఒక ఉపాధ్యాయుడు స్కూల్‌లోని ఆడపిల్లలను ఇబ్బందులకు గురిచేస్తే, విచారణ జరిపి ఆ ఉపా ధ్యాయుడిని జైల్‌కు పంపిం చడం జరిగిందని గుర్తుచేశారు. పదిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు ఎస్పీ చేతుల మీదు గా ప్రోత్సాక బహుమ తులను అందించారు. కార్యక్రమంలో సీఐ తబ్రేజ్‌, కోడుమూరు, సి.బెళగల్‌ ఎస్‌ఐలు డివై స్వామి, వేణుగోపాల్‌ ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:04 AM