Share News

మే 16న సామూహిక వివాహాలు

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:27 AM

ఏటా తన జన్మదినమైన మే 16న సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని, వివాహం చేసుకునే జంటలకు ఈ ఏడాది రూ.80వేలు ఆర్థిక సాయం చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు

 మే 16న సామూహిక వివాహాలు
పోస్టర్లను విడుదల చేస్తున్న టీజీ వెంకటేశ్‌

కర్నూలు కల్చరల్‌/ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఏటా తన జన్మదినమైన మే 16న సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని, వివాహం చేసుకునే జంటలకు ఈ ఏడాది రూ.80వేలు ఆర్థిక సాయం చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. వివాహ పారితోషికం అందుకునే వారి కోసం దరఖాస్తుల కార్యాలయాన్ని మౌర్య ఇన్‌లో ఆయన ప్రారంభించారు. వివాహాల వివరాల పోస్టర్లను టీజీ వెంకటేశ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా గత 30 సంవత్సరాలుగా సామూహిక వివాహాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. వివాహం చేసుకునే వధూవరులలో ఒకరు కర్నూలు నియోజికవర్గం పరిధిలో కానీ, పంచలింగాల, ఈ-తాండ్రపాడు, గొందిపర్ల, పూలతోట, దేవమాడ, దొడ్డిపాడు గ్రామాలకు చెందినవారై ఉండాలన్నారు. అన్ని మతాల వారు ఈ పారితోషికం పొందడానికి అర్హులేనని ఆయన తెలిపారు. నగదు పారితోషికంతోపాటు తాళిబొట్టు, కాలి మెట్టెలు, పట్టు వస్త్రాలు ఇస్తామని టీజీ వెంకటేశ్‌ తెలిపారు. వాయుగండ్ల సుబ్బారావు, కె.రామస్వామి, దాశెట్టి శ్రీనివాసులు, విఠల్‌శెట్టి పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 12:27 AM