మిగిలింది మూడు రోజులే..
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:22 AM
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన (సర్) ప్రక్రియకు ఇక మిగిలింది మూడు రోజులేనని, శని ఆదివారాల్లో నిర్వహిం చే ప్రత్యేక శిబిరాలను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సూచించారు.
‘సర్’ ప్రత్యేక శిబిరాలను వినియోగించుకోవాలి
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కల్లూరు, జూలై 11(ఆంధ్రజ్యోతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన (సర్) ప్రక్రియకు ఇక మిగిలింది మూడు రోజులేనని, శని ఆదివారాల్లో నిర్వహిం చే ప్రత్యేక శిబిరాలను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సూచించారు. శనివారం జాయింట్ కలెక్టర్ (ఈఆర్‌ఓ) కల్లూరు పరిధిలోని 100 నుంచి 120 వరకు పోలింగ్ కేంద్రాల్లో కల్లూరు తహసీల్దారు కె.ఆంజనేయులు (ఏఈఆర్‌ఓ) , పాణ్యం ఎలక్షన డీటీ అనూరాధలతో కలిసి పర్యటించారు. ప్రత్యేక శిబిరాల్లో ఓటర్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ మరణించిన, డూప్లికేట్, గుర్తించలేని ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలపై బీఎల్‌ఓలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కొత్త ఓటరుగా నమోదు కావాలనుకునే వారు వివరాల్లో మార్పులు లేదా తొలగింపులు కోరుకునే దరఖాస్తులను కూడా నిబంధనల ప్రకారం వెంకటనే స్వీకరించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా సర్ ప్రక్రియను విజయవంతం చేయాలని జేసీ దిశా నిర్దేశం చేశారు.